టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం

64చూసినవారు
టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేస్తాం
పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఆచంట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరై మాట్లాడారు. గత వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటమన్నారు. త్వరలోనే పార్టీ బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం
చుడుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్