విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నవంబర్ నెల నుండే ప్రాధాన్యత ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అమలు చేసేందుకు పోలవరం, వెలిగొండ, చింతలపూడి, గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై నిపుణులతో వర్క్ షాప్ నిర్వహించామన్నారు.