రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ. 20, 000 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించిందని అయితే ఖరీఫ్ సీజన్ దాటి రబీ సీజన్ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నా పెట్టుబడి సాయం విధులు విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు.