సంక్రాంతి సంబరాలలో భాగంగా సోమవారం కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేలను పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభించారు. పందెం క్రీడలను పండుగ వేళల్లో అమలు చేయడం సాంప్రదాయానికి విలువ ఇచ్చినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు నిర్వహించే పోటీలలో ఎక్కువ పెందేలు గెలిచిన వారికి మూడు బుల్లెట్ బైకులు బహుమతిగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.