గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశం

70చూసినవారు
జీలుగుమిల్లి మండల గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో గురువారం పోలీసులు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్ కుమార్ మాట్లాడుతూ. గణేశ్ ఉత్సవం అనుమతుల కోసం ఆన్లైన్ లో ganeshutsav. net వెబ్ సైట్ లేదా వాట్సాప్ నెంబర్ 7995095800 ద్వారా పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలని వివరించారు. అలాగే మండపాల వద్ద కమిటీ సభ్యులు పలు జాగ్రత్తలు వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్