పోలవరం: వారికి మద్యం షాపులు కేటాయించడం సనాతన ధర్మమా: మాజీ ఎమ్మెల్యే
మహిళలకు మద్యం షాపులు కేటాయించడం సనాతన ధర్మమా అంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో సూటి ప్రశ్న సంధించారు. మహిళలు ఉద్యోగ, రాజకీయ, పురుషులతో సమానంగా తమను పరిగణించాలి అని ఉద్యమించారే కానీ, ఏనాడూ మద్యం షాపులు కేటాయించాలి అంటూ ఏ ప్రభుత్వాలను అడగలేదు అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మహిళలకు మద్యం షాపులు కేటాయించడం వారి రాజకీయ సంకుచిత ధోరణికి నిదర్శనం అన్నారు.