తాడేపల్లిగూడెం పట్టణం హౌసింగ్ బోర్డులో వేంచేసియున్న శ్రీ దక్షిణముఖ సువర్చల సుందర అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ర్వత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బుధవారం స్వామివారికి అభిషేకాలు, నాగవల్లి ధళార్చన, సింధూర పూజ, మూల మంత్ర హోమాలు నిర్వహించారు. స్వామివారిని జనసేన నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి రాజేష్ దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం పల్లకి సేవ నిర్వహించారు. ఎ. నరసింహా మూర్తి పాల్గొన్నారు.