తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలోని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ కార్యాలయం(సౌత్)లో ఏఈ ఆర్. సుబ్రమణ్యంను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ సుంకర శ్రీనివాస్, కార్యదర్శి వి.రామ మోహన రావు, కోశాధికారి లయన్ కే. కాశీ విశ్వనాధం, జోన్ చైర్మన్ లయన్ మదన్ మోహన్ అగర్వాల్, లయన్ పచ్చా వెంకటేశ్వరరావు, లయన్ యర్ర ఆంజనేయస్వామి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.