మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్ నాయుడు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ కి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న సమస్యలు గురించి చర్చించారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.