తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుపోలు గ్రామంలో వైస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామ్ నాయుడు హాజరయ్యారు. అనంతరం వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.