తణుకు నుంచి భద్రాచలానికి ఏర్పాటు చేసిన అల్ట్రా డీలక్స్ బస్సు సమయంలో మార్పులు చేసినట్లు డిపో మేనేజరు గిరిధర్ కుమార్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తణుకు డిపో నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం, నల్లజర్ల, పోతవరం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, మందపల్లి, సత్తుపల్లి, వీఎం బంజర, యర్రగుంట, చంద్రగుంట, కొత్తగూడెం, పాల్వంచ, బుర్గంపాడు మీదుగా మధ్యాహ్నం 12. 20 గంటలకు భద్రాచలం చేరుతుందన్నారు.