ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో" భాగంగా బుధవారం అత్తిలి మండలంలో కలెక్టర్ నాగరాణితో కలిసి గ్రామంలో రూ. 1 కోటి 10 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.