"ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉండిలో ఆక్రమణలు తొలగించి కాలువలు అభివృద్ధి చేసిన ప్రాంతంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎన్డీఏ కూటమి గత వంద రోజులుగా చేసిన పాలనా ప్రగతి గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఉండిలోని రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి జుత్తుగ నాగరాజు పాల్గొన్నారు.