పేదల ఇళ్లను తొలగించాలని చూస్తున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కుట్రలను తిప్పికొట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పాలకోడేరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఏఎస్ఆర్ నగర్‌లో 140 మంది దశాబ్దాల క్రితం ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారి ఇళ్లను తొలగించాలని ఎమ్మెల్యే కుట్రలు చేయడం తగునా అని జక్కంశెట్టి ప్రశ్నించారు.