ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో మన మహోత్సవం సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తుక నాగరాజు మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాలలో విరివిగా మొక్కలు నాటాలని నాటిన తర్వాత వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనుమ సుబ్బలక్ష్మి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.