కూటమి ప్రభుత్వం నూతన మద్యం దుకాణాలను నేటి నుండి తీసుకురావడం పట్ల ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం తాగే వాళ్ల మీద 2% సెస్ విధించి వసూలైన మొత్తాన్ని డి- అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఇదొక వినూత్నమైన నిర్ణయం అని అన్నారు.