ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ లక్ష్మీ సునీత, సచివాలయ సిబ్బంది మరియు కూటమి సభ్యులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులలో చేసిన మంచిని, అలాగే ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలను తొందరలోనే నెరవేరుస్తారని, హామీలు ఇంకా అమలు కాకపోవడానికి గత ప్రభుత్వ తప్పిదాలను ప్రజలకు వివరించారు.