నిడమర్రు మండలం చిననిండ్రకొలను హైస్కూల్లో బుధవారం ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తాము తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించి వాటి విశిష్టతను వివరించారు. విజేతలకు గ్రామ ఉపసర్పంచ్ రుద్రరాజు కొండ రాజు బహుమతులు అందించారు. విద్యార్థులు హవీల, మహాలక్ష్మి, అభిరామ్, అనూహ్య, భవ్య సిరి,తేరేజమ్మ విజేతలుగా నిలిచారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.వి. సత్యనారాయణ పాల్గొన్నారు.