ఉంగుటూరు మండలం నారాయణపురం కళింగ సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకమాస వనసమారాధన జరిగింది. తొలుత భక్తులు ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గం
జనసేన పార్టీ ఇంచార్జీ పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. వీరికి కళింగ సేవా సంఘం శాలువా కప్పి సన్మానించారు.