వైరస్ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము వల్ల వెలువడే తుంపర్లు, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, కరచాలనం, తాకడం వంటి చర్యలతో హ్యూమన్ మెటానిమోవైరస్ HMPV ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశాలు ఎక్కువ. 2001లోనే గుర్తించిన ఈ HMPVకి వ్యాక్సిన్, నిర్దిష్టమైన చికిత్సలు లేవు. లక్షణాలకు అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.