ఏపీలో ఈ నెల 8తో రెవెన్యూ సదస్సులు ముగియనున్నాయి. ఉత్తరాంధ్రలో మాత్రం సంక్రాంతి తర్వాత కూడా ఐదు రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సదస్సుల్లోనే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం 4 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌లో పెట్టిందని.. ఇందులో 25 వేల ఎకరాలే రిజిస్ట్రేషన్ చేసిందన్నారు. దీనిలో 7 వేల ఎకరాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.