అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే
ఇరగవరం మండలం నారాయణపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కుటుంబం నిరాశ్రయులయ్యారు. ఈ సందర్భంగా బాధితులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఎమ్మెల్యే పదివేల రూపాయలు, 25 కిలోల బియ్యం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.