TG: హైదరాబాద్ జమ్మిగడ్డలోని బీజేనగర్ కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటేష్ అనే వ్యక్తికి సాయి కృష్ణ, సాయి, రాకేష్ అనే కుమారులు ఉన్నారు. సాయి కృష్ణ, సాయి ఫోన్ విషయంలో గొడవపడ్డారు. ఇద్దరినీ తండ్రి మందలించడంతో మనస్థాపం చెందిన అన్న సాయికృష్ణ (18) యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.