ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఒక షాకింగ్ సంఘటన జరిగింది. కేవలం 20 రూపాయలకే బట్టతలకి చికిత్స అని ప్రచారం చేయగానే.. బట్టతల బాధితులు బారులు తీశారు. దాదాపు రెండు వేలమంది వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పై వీడియోలో మీరు బాధితులకు తలపై ప్రత్యేక ఔషధం రాస్తున్నట్లు చూడవచ్చు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.