పాలకోడేరు: విద్యార్థులకు పుస్తకాలు అందజేత
పిల్లలపట్ల ఫోన్లు వాడకంపై తల్లిదండ్రులు అత్యధిక శ్రద్ధ చూపెట్టాలని ఇమ్మానుయేలు ట్రస్ట్ నిర్వాహకుడు ఎర్నేస్ట్ పాల్ సూచించారు. మంగళవారం పాలకోడేరు మండలం మోగల్లు వైఎస్సార్ కాలనీలో పరిశుద్ధ క్రీస్తు దేవాలయం ట్రస్ట్ ప్రెసిడెంట్ ఆర్ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో.. చిల్డ్రన్ క్లబ్ తరగతులు ఘనంగా నిర్వహించినట్లు ఆర్ ప్రణీత ఏంజిల్ తెలిపారు. అనంతరం సండే స్కూల్ విద్యార్థులకు నోట్స్, విద్యా సామగ్రిని బహుకరించారు. ఈ కార్యక్రమంలో జయమ్మా,రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.