పెనుమంట్ర: ముమ్మరంగా రహదారి నిర్మాణ పనులు
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామం నుంచి పాలకొల్లు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ, నూతన రహదారి నిర్మాణ పనులను శుక్రవారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో వెళ్లే వాహనాలను వివిధ మార్గాల ద్వారా దారి మళ్ళిస్తున్నారు. ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఆదేశానుసారం స్థానిక కూటమి నాయకులు రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.