శరన్నవరాత్రులకు మాజీ ఎమ్మెల్సీ శేషు బాబుకు ఆహ్వానం
పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో ఘనంగా జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి 20వ వార్షిక మహోత్సవానికి, మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పీ చైర్మన్ మేకా శేషుబాబును దేవి శరన్నవరాత్రి కమిటీ సభ్యులు సోమవారం ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పితాని సూరిబాబు, జిత్తుగ సత్యనారాయణ, జిత్తుగ రాంపండు, కట్టా సత్యనారాయణ, పి. లక్ష్మణస్వామి, జిత్తుగ నరసయ్య, కవురు నరసయ్య, చెల్లంగి వెంకట నాగరాజు పాల్గొన్నారు.