పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో మనకోసం మనం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు విద్యాసామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. జిన్నూరు జిల్లా పరిషత్ హైస్కూల్, ఎన్. ఆర్ పేట, భూపయ్య చెరువు, పెదపేట, సాకిరేవుగుంట పాఠశాలలలో మాజీ సొసైటీ అధ్యక్షులు దేవళ్ళ ప్రసాద్ ఆర్థిక సహకారంతో 350 మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు పడాల పెద్దిరాజు, సభ్యులు పాల్గొన్నారు.