టి.నరసాపురం - TNarsapuram

టి. నరసాపురం: యువకుడు అదృశ్యం

టి. నరసాపురం: యువకుడు అదృశ్యం

గురజాల చంద్రబాబు అనే వ్యక్తి అదృశ్యం అయినట్లు టి. నరసాపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.జయబాబు తెలిపారు. ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో టి.నరసాపురం మండలం, ఏపిగుంట గ్రామపంచాయతీ, గుర్వాయిగూడెంలోని తమ స్వగృహం నుండి ఏపీ37సిడి3777 నెంబర్ గాల బైక్ పె పని మీద వెళ్లినట్లు తెలిపారు. ఆ రోజు నుంచి చుట్టుపక్కలంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తల్లి గురజాల రామ సీత (50) సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం జయబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. గురజాల చంద్రబాబు ఆచూకీ తెలిసినవారు 94407 96676 కు సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా