TG: రుణమాఫీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటికే రూ.18 వేల కోట్లతో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామని అన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని, అతి త్వరలోనే వారికి కూడా రుణమాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు.