తిరుమల బహిరంగ సభలో జనసేన డిక్లరేషన్‌ను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం విడుదల చేయనున్నారు. దీంతో ఆ డిక్లరేషన్‌లో ఏ అంశాలు ఉంటాయోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్లు, కాపులకు 9వ షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆసుపత్రులు వంటి కీలక హామీలు డిక్లరేషన్‌లో ఉండనున్నట్లు సమాచారం.