జగన్ తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 'జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామనడం ఏంటి?'. మాజీ ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకోవడానికి అనుమతి కావాలా?. జగన్ శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. సీఎంగా జగన్ ఎన్నో సార్లు స్వామిని దర్శించుకున్నారు. అప్పుడు రాని వివాదం ఇప్పుడెందుకు వస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు' అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.