ఏపీలో అటవిక, అరాచక పాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోంది. వైసీపీ వాళ్లపై దాడులు చేసి.. వారిపైనే కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. జగనే కనుక ఉండి ఉంటే.. ఈ పాటికే మా సంక్షేమం మాకు అంది ఉండేది కదా అనుకుంటున్నారు.’ అని అన్నారు.