విశాఖలో బైకులు తగలపెట్టిన మహిళ అరెస్ట్

79చూసినవారు
విశాఖలో బైకులు తగలపెట్టిన మహిళ అరెస్ట్
ఓ మహిళ విశాఖలో బైకులకు తగలబెట్టేసిన ఘటన కలకలం రేపింది. GVMCలో పనిచేస్తున్న భరత్ అనే వ్యక్తి తనను మోసం చేశాడనే కోపంతో, బర్మా క్యాంపు వద్ద అతని వాహనానికి నిప్పుపెట్టింది. అయితే ఆ మంటలు చెలరేగి పక్కనే ఉన్న బైకులకు అంటుకోవడంతో 18 బైకులు కాలిపోయి, రూ.19 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని ఏసీపీ లక్ష్మణమూర్తి తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. ఆమెకు 11 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత పోస్ట్