నోరు తెరిచి తన కోరిక అడిగిన మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం సందర్భంగా పర్యటనలు చేసిన సీఎం చంద్రబాబు.. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా ఓ ఇంటికి వెళ్లిన మహిళ.. తనకు సొంతిల్లు లేదని సీఎం ముందు వాపోయింది. తనకు సొంత ఇల్లు కట్టించాలని వేడుకుంది. ఆ విజ్ఞప్తికి ఓకే చెప్పిన చంద్రబాబు.. ఆ మహిళకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు.