ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లు, అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో వైసీపీ పోరుబాటకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2 నెలలుగా జీతాలు రాకపోవడం, తమ సేవలను ఉపయోగించుకోకపోవడంతో వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వీరు త్వరలో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకోవడంతో వారికి మద్దతు ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.