ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు: చంద్రబాబు

83చూసినవారు
ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు: చంద్రబాబు
ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో టీడీపీ నేత మోహన్‌రావుపై వైసీపీ దాడిని ఆయన ఖండించారు. 'రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లు వైసీపీ వ్యవహరిస్తోంది. మోహన్‌పై మూకుమ్మడి దాడి చేశారు. దాడి సమయంలో పోలీసులు ఉన్నా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దాడి చేసిన రౌడీలపై ప్రకాశం జిల్లా ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలి' అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్