వైసీపీ ఓటమి.. మాజీ మంత్రి రాజీనామా (వీడియో)

74చూసినవారు
గుంటూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శుక్రవారం ప్రకటించారు. ‘నాలుగు దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు చేరుకుంది. మోడీ, చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నా.’ అని అన్నారు. వైసీపీ ఓటమి తర్వాత రావెల రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్