వైఎస్ జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు: అనిత

63చూసినవారు
వైఎస్ జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు: అనిత
వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. లేని దిశ చట్టం పేరుతో జగన్ కాలయాపన చేశారని ఆమె విమర్శించారు. ఒక్క మహిళ ప్రాణాలు కూడా దిశ చట్టం కాపాడలేకపోయిందని హోం మంత్రి అనిత అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్రీడల నిర్వహణలో ఆమె పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్