మనలో చాలా మందికి భోజనంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా పెరుగుతో తింటేనే సంతృప్తి కలుగుతుంది. పెరుగు తినడం వల్ల అనేక పోషకాలు లభించడంతో పాటు చర్మారోగ్యం మెరుగవుతుంది. దీనిలోని కాల్షియం ఎముకలు, దంతాల బలానికి ఉపయోగపడతాయి. పెరుగలో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. షుగర్ పేషంట్లకు పెరుగు మంచి ఔషదంలా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.