ప్రస్తుతం ఓ చేపకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చేప సముద్ర తీరంలో ఉన్న నీటి గుంతలో ఉంటుంది. ఆ గుంతలోని నీరు ఆవిరైతే ఆ చేప చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని పసిగట్టిన ఆ చేప.. గుంట చివరకు వెళ్లి ధైర్యం చేసి నీటిలో నుంచి గట్టు మీదకు వెళ్తుంది. బలంగా ఈదుతూ నేలపై నుంచి ఎలాగోలా చివరకు సముద్రంలోకి చేరుకుంటుంది. ఆపై స్వేచ్ఛగా ఈదుకుంటూ సముద్రంలోకి వెళ్లిపోతుంది.