పాలిటెక్నిక్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

82చూసినవారు
పాలిటెక్నిక్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్ జ్యోతి జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవం గురించి వివరించారు. అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులు పై తిరుగులేని విజయంతో సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భారత జాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు స్వాతంత్ర దినోత్సవం అని వివరించారు.

సంబంధిత పోస్ట్