డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సర్పంచులు, అధికారులతో ప్రమాణం చేయించారు. మంగళవారం వల్లూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. గ్రామాలలో పార్టీలకతీతంగా అభివృద్ధి జరగాలని సూచించారు. దేశానికి యువతే శక్తి అని యువత మనుగడ కొరకు డ్రగ్స్ రహిత సమాజం అవసరం అన్నారు.