ఎన్నికలకు ముందు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే పథకాన్ని అమలు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పెండ్లిమర్రి మండల పరిధి పగడాల పల్లె ఇసుక నిల్వ కేంద్రం వద్ద ఉచిత ఇసుక పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉచిత ఇసుక పథకం పారదర్శకంగా అమలవుతోందన్నారు.