మైదుకూరు డివిజన్ పరిధిలోని బ్రహ్మంగారి మఠం మండల పోలీస్ స్టేషన్ ను డి. ఎస్. పి రాజేంద్రప్రసాద్ శుక్రవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించి తగిన సలహాలు, సూచనలు చేశారు. అనంతరం మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.