మురికి తాగునీటి నుండి పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడండి

58చూసినవారు
మురికి తాగునీటి నుండి పట్టణ ప్రజల ఆరోగ్యాలను కాపాడండి
మైదుకూరులోని నూతన సాయిబాబా గుడి ఆలయం ఎదురుగా తాగునీటి పైప్ లైన్ దెబ్బతిన్నా కూడా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం దారుణమని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ అన్నారు. రైతు సేవా సమితి నియోజకవర్గ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. వర్షాకాలం మురికి నీటితో తాగిన, స్నానం చేసిన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని కావున మున్సిపల్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్