మైదుకూరు పట్టణానికి చెందిన ప్రీతి ఫౌండేషన్ చైర్మన్ యం. నాగార్జున గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మైదుకూరు పట్టణంలో ఉండే అనాధలకు, వృద్ధులకు చిరు సహాయాన్ని అందజేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. అనాధలు, వృద్ధుల మధ్య స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోషాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రీతి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.