బీజేపీ జిల్లా కార్యదర్శిగా ప్రొద్దుటూరుకు చెందిన అర్కటవేముల హరినారాయణను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి చేతుల మీదుగా హరినారాయణ బుధవారం విజయవాడలో నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలను అందరికి తెలియపరిచి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడతానని పేర్కొన్నారు.