ప్రొద్దుటూరులోని స్థానిక పాత మార్కెట్ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం జగన్మోహన్ రెడ్డి సీఎంగా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవాలని 20వ వార్డు కౌన్సిలర్ నూక నాగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో స్వామికి విశేష నవనీత వెన్నతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కెవిఎస్ సత్యనారాయణ, ధర్మకర్త సుంకుకిషోర్ బాబు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.