బంగారు ఆభరణాలపై కేంద్రం కీలక ప్రకటన
బంగారు ఆభరణాల ప్యూరిటీ, మోసాలను నివారించడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 23వ తేదీ 2021 నుంచి ఆభరణాలపై హాల్మార్కింగ్ ప్రక్రియ షురూ కాగా.. దశల వారీగా దీనిని విస్తరించే యోచన చేసి.. తాజాగా ఏపీ, బిహార్, కేరళ, హరియాణా, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల్లోని మొత్తం 18 జిల్లాల్లో హాల్ మార్కింగ్ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా హాల్మార్కింగ్ విధానం కిందికి వచ్చిన మొత్తం జిల్లాల సంఖ్య 361కి చేరింది.